stitcherLogoCreated with Sketch.
Get Premium Download App
Listen
Discover
Premium
Shows
Likes
Merch

Listen Now

Discover Premium Shows Likes

Harshaneeyam

300 Episodes

42 minutes | Mar 10, 2023
యువ రచయిత వెంకట నారాయణ గారితో పరిచయం
ఇరవై మూడేళ్ళ వెంకటనారాయణ పల్నాడు జిల్లా గరికపాడు గ్రామానికి చెందిన వారు. ఎం ఏ తెలుగు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో పూర్తి చేశారు. 'భూమి పతనం' అనే నవల, 'ఇయ్యాల మా వూళ్ళో' అనే కవితా సంకలనం గత సంవత్సరం ప్రచురితమయ్యాయి. మంచి చదువరి. ఈ రచయితలా రాసేదానికంటే ఎక్కువ చదువుతూ , తాను చదివిన పుస్తకాల గురించి చక్కగా అర్థవంతంగా మాట్లాడే రచయితలు చాలా అరుదు. ప్రస్తుతం 'గరికపాటోడి కథలు' అనే కథా సంపుటి ని, 'కాపలాదారుల పాటలు' అనే కవితాసంపుటిని ప్రచురించే పనిలో వున్నారు. భూమి పతనం నవల కొనడానికి - https://bit.ly/bhoomig స్పాటిఫై యాప్ కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసి హర్షణీయం పాడ్కాస్ట్ ని వినండి https://bit.ly/harshspot This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp Chartable - https://chartable.com/privacy
58 minutes | Mar 5, 2023
‘చిలుకంబడు దధికైవడి’ - మూలం తమిళ రచయిత జెయమోహన్ రచన ‘మత్తుఱు తయిర్’
ఈ కథకు మూలం ప్రముఖ తమిళ రచయిత జెయమోహన్ రాసిన  ‘మత్తుఱు తయిర్’ (Mathuru thayir Jayamohan | மத்துறு தயிர் ஜெயமோகன்) అనే కథ.  జెయమోహన్ గారి ‘అఱం’ అనే కథాసంకలనం లోనిది.  ‘అఱం’ లోని పన్నెండు కథలు, నిజ జీవితంలోని ప్రత్యేకమైన, ప్రసిద్ధమైన  వ్యక్తుల గురించి మనకు చెబుతూ   రచయిత రాసిన  కథలు.  ఈ కథలోని ముఖ్య పాత్ర , తిరువనంతపురం విశ్వవిద్యాలయ ఆచార్యుడుగా  తమిళ సాహిత్యాన్ని బోధించిన ప్రొఫెసర్ జేసుదాసన్. (https://tamil.wiki/wiki/Professor_Jesudasan) కన్యాకుమారి జిల్లాలో ఒక నీరుపేద కుటుంబంలో జన్మించారు.   ‘కంబ రామాయణం’  విస్తృతంగా అధ్యయనం చేసి, అందులోని కవితా సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ వేలాది విద్యార్థులను తన  ఉపన్యాసాలతో  అపరిమితంగా ప్రభావితం చేసి, వారిని  సాహిత్యం వైపు మళ్ళించారు. తమిళ సాహితీ విమర్శకుడిగా కూడా ఎంతో పేరు గడించిన   ప్రొఫెసర్ జేసుదాసన్ 2002 వ సంవత్సరంలో మరణించారు.  రామాయణంలోని సీతారాముల మధ్య వియోగాన్ని కంబ రామాయణం లోని పద్యాల ద్వారా మనకు వివరిస్తూ, వర్ణిస్తూ, తద్వారా గురు శిష్యుల మధ్య సంబంధాన్ని గొప్పగా ఆవిష్కరించిన కథ ఇది.  *ఈ కథలో ప్రస్తావించబడ్డ పద్యాలు పూతలపట్టు శ్రీరాములురెడ్డి గారు తెనిగించిన  ‘కంబ రామాయణం’ లోనివి.  ‘చిలుకంబడు దధికైవడి’  “నువ్విక్కడుండి చేసేదేవుంది? బండెక్కు!”   అన్నాడు కుమార్, ప్రొఫెసర్ని సభకు తీసుక రావడానికి బయలుదేరుతూ.    “అరుణ కూడా వస్తానంది! ఆమె కోసం చూస్తున్నాను” అంటూ నసిగాను.  “బావుంది.ఎదురెళ్ళి హారతి ఇస్తావా ఏంటి? భార్య, అంటే ‘ప్రేమ’ ఉండాలి కానీ ‘ఇంత’  అవసరం లేదేమో?” అంటూ వాన్  తలుపు తెరిచాడు కుమార్.  “ఇలాంటి సమావేశాలకు వచ్చినప్పుడు, ప్రొఫెసర్ మాంఛి ఊపులో ఉంటాడు. అపుడు ఆయన మాట్లాడుతూంటే వినడం ఓ గొప్ప అనుభవం. నువ్వావకాశం కోల్పోడం నాకిష్టం లేదు. చూస్తావుగా? ” అన్నాడు బండి నడుపుతూ కుమార్.   “ వాళ్ళావిడ కూడా హల్లెలూయా అనుకుంటూ పక్కనే వుంటారేమో” అన్నా నేను.  “లేదు…లేదు. ఆవిడ స్టీఫెన్ కార్లో వస్తున్నారు. వాన్లో ఎక్కితే కళ్ళు తిరుగుతాయంది. సరే అంబాసిడర్ లో రండి, దాంట్లో అయితే ఇబ్బంది ఉండదు అని చెప్పాను.  ప్రొఫెసర్ తో  మాట్లాడేటప్పుడు మటుకు -  సంభాషణని తెలివిగా కంబ రామాయణం మీదికి మళ్ళించే బాధ్యత నీదే! మధ్యలో పొరపాటున బైబిలని కానీ ప్రభువా! అని కానీ  అన్నావో… అంతా వేరే దార్లో కెళ్ళిపోతుంది.” నింపాదిగా చెప్పుకుపోతున్నాడు కుమార్. “ఇప్పుడు మూడేగా. సభ మొదలయ్యేది ఆరుగంటలకు కదా?” అన్నాను.  “నన్నడిగితే ఇప్పటికే ఆలస్యం అయ్యింది అంటాను. కాలాలు, వాటికి సంబంధించిన పరిమితులు..  వీటన్నిటికీ అతీతుడు ఆయన. ఇది పొద్దునా, రాత్రా,  అనే  స్పృహ కొంచెం  కూడా ఉండదు. ఈ పాటికే ఊళ్ళో వుండే దిక్కుమాలిన సంతంతా ఆయన  చుట్టూ చేరి, పోచుకోలు కబుర్లలో దింపేసుంటారు. ఈ మహాత్ముడు చిన్న పిల్లాడిలా వాళ్ళకు తన చెవులు అప్పగించి, వింటూ ఉంటాడు. వెళ్ళగానే ఆయనకు స్నానం చేయించి, లాల్చీ, పంచె తగిలించి, తీసుకవెళ్ళాల్సి ఉంటుంది.” “స్నానం కూడా చేయించాలా?” నవ్వాను నేను.  “అలానే ఉండబోయేట్టుంది!” కారు పున్నైవనం దగ్గర, కుడివైపుకు తిరిగింది. ”సజిన్ కి  ఒక పని అంటగట్టి, నీ మీద గురి కుదరాలంటే, నువ్వీ పని పూర్తి చేయాలి!  అని చెప్పి మరీ వచ్చాను.” అన్నాడు కుమార్.  “అతనికి ఈ రోజు కాలేజీ లేదా?” “ వుంది. కానీ నాకు అసలు విషయం అకస్మాత్తుగా  నిన్న రాత్రి  గుర్తుకొచ్చింది. మన వల్ల అయ్యే పని కాదు! అందుకని అప్పటికప్పుడు  అతనికి...
24 minutes | Mar 4, 2023
‘చిలుకంబడు దధికైవడి’ కథాసమీక్ష - ఉణుదుర్తి సుధాకర్ గారు
‘చిలుకంబడు దధికైవడి’ అనే కథకు మూలం, రచయిత జెయమోహన్ రాసిన  ‘మత్తుఱు తయిర్’ (Mathuru thayir Jayamohan | மத்துறு தயிர் ஜெயமோகன்) అనే కథ, ‘అఱం’ అనే కథాసంకలనం లోనిది.  ఈ కథను ప్రముఖ కథా రచయిత శ్రీ ఉణుదుర్తి సుధాకర్ గారు ఈ ఎపిసోడ్ లో సమీక్షిస్తారు. వారికి కృతజ్ఞతలు. ఈ కథకు మూలం ప్రముఖ తమిళ రచయిత జెయమోహన్ రాసిన  ‘మత్తుఱు తయిర్’ (Mathuru thayir Jayamohan | மத்துறு தயிர் ஜெயமோகன்) అనే కథ.  జెయమోహన్ గారి ‘అఱం’ అనే కథాసంకలనం లోనిది.  ‘అఱం’ లోని పన్నెండు కథలు, నిజ జీవితంలోని ప్రత్యేకమైన, ప్రసిద్ధమైన  వ్యక్తుల గురించి మనకు చెబుతూ   రచయిత రాసిన  కథలు.  ఈ కథలోని ముఖ్య పాత్ర , తిరువనంతపురం విశ్వవిద్యాలయ ఆచార్యుడుగా  తమిళ సాహిత్యాన్ని బోధించిన ప్రొఫెసర్ జేసుదాసన్. కన్యాకుమారి జిల్లాలో ఒక నీరుపేద కుటుంబంలో జన్మించారు.   ‘కంబ రామాయణం’  విస్తృతంగా అధ్యయనం చేసి, అందులోని కవితా సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ వేలాది విద్యార్థులను తన  ఉపన్యాసాలతో  అపరిమితంగా ప్రభావితం చేసి, వారిని  సాహిత్యం వైపు మళ్ళించారు. తమిళ సాహితీ విమర్శకుడిగా కూడా ఎంతో పేరు గడించిన   ప్రొఫెసర్ జేసుదాసన్ 2002 వ సంవత్సరంలో మరణించారు.  రామాయణంలోని సీతారాముల మధ్య వియోగాన్ని కంబ రామాయణం లోని పద్యాల ద్వారా మనకు వివరిస్తూ, వర్ణిస్తూ, తద్వారా గురు శిష్యుల మధ్య సంబంధాన్ని గొప్పగా ఆవిష్కరించిన కథ ఇది.  *ఈ కథలో ప్రస్తావించబడ్డ పద్యాలు పూతలపట్టు శ్రీరాములురెడ్డి గారు తెనిగించిన  ‘కంబ రామాయణం’ లోనివి.  ‘చిలుకంబడు దధికైవడి’  - “నువ్విక్కడుండి చేసేదేవుంది? బండెక్కు!”   అన్నాడు కుమార్, ప్రొఫెసర్ని సభకు తీసుక రావడానికి బయలుదేరుతూ.    “అరుణ కూడా వస్తానంది! ఆమె కోసం చూస్తున్నాను” అంటూ నసిగాను.  “బావుంది.ఎదురెళ్ళి హారతి ఇస్తావా ఏంటి? భార్య, అంటే ‘ప్రేమ’ ఉండాలి కానీ ‘ఇంత’  అవసరం లేదేమో?” అంటూ వాన్  తలుపు తెరిచాడు కుమార్.  “ఇలాంటి సమావేశాలకు వచ్చినప్పుడు, ప్రొఫెసర్ మాంఛి ఊపులో ఉంటాడు. అపుడు ఆయన మాట్లాడుతూంటే వినడం ఓ గొప్ప అనుభవం. నువ్వావకాశం కోల్పోడం నాకిష్టం లేదు. చూస్తావుగా? ” అన్నాడు బండి నడుపుతూ కుమార్.   “ వాళ్ళావిడ కూడా హల్లెలూయా అనుకుంటూ పక్కనే వుంటారేమో” అన్నా నేను.  “లేదు…లేదు. ఆవిడ స్టీఫెన్ కార్లో వస్తున్నారు. వాన్లో ఎక్కితే కళ్ళు తిరుగుతాయంది. సరే అంబాసిడర్ లో రండి, దాంట్లో అయితే ఇబ్బంది ఉండదు అని చెప్పాను.  ప్రొఫెసర్ తో  మాట్లాడేటప్పుడు మటుకు -  సంభాషణని తెలివిగా కంబ రామాయణం మీదికి మళ్ళించే బాధ్యత నీదే! మధ్యలో పొరపాటున బైబిలని కానీ ప్రభువా! అని కానీ  అన్నావో… అంతా వేరే దార్లో కెళ్ళిపోతుంది.” నింపాదిగా చెప్పుకుపోతున్నాడు కుమార్. “ఇప్పుడు మూడేగా. సభ మొదలయ్యేది ఆరుగంటలకు కదా?” అన్నాను.  “నన్నడిగితే ఇప్పటికే ఆలస్యం అయ్యింది అంటాను. కాలాలు, వాటికి సంబంధించిన పరిమితులు..  వీటన్నిటికీ అతీతుడు ఆయన. ఇది పొద్దునా, రాత్రా,  అనే  స్పృహ కొంచెం  కూడా ఉండదు. ఈ పాటికే ఊళ్ళో వుండే దిక్కుమాలిన సంతంతా ఆయన  చుట్టూ చేరి, పోచుకోలు కబుర్లలో దింపేసుంటారు. ఈ మహాత్ముడు చిన్న పిల్లాడిలా వాళ్ళకు తన చెవులు అప్పగించి, వింటూ ఉంటాడు. వెళ్ళగానే ఆయనకు స్నానం చేయించి, లాల్చీ, పంచె తగిలించి, తీసుకవెళ్ళాల్సి ఉంటుంది.” “స్నానం కూడా చేయించాలా?” నవ్వాను నేను.  “అలానే ఉండబోయేట్టుంది!” కారు పున్నైవనం దగ్గర, కుడివైపుకు...
21 minutes | Feb 25, 2023
'ఇసుక అద్దం' శ్రీ వూహ గారితో సంభాషణ
శ్రీ వూహ గారి మొదటి కథా సంపుటం 'ఇసుక అద్దం'డిసెంబర్ నెలలో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో తన కథారచన గురించి, తనను ప్రభావితం చేసిన విషయాల గురించి శ్రీ వూహమాట్లాడారు. ఇసుక అద్దం కొనడానికి క్రింది లింక్ ను ఉపయోగించండి. https://bit.ly/isukaaddam This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp Chartable - https://chartable.com/privacy
34 minutes | Feb 18, 2023
'సత్యలింగం' - పతంజలి శాస్త్రి గారి రచన (గుప్తా'91 సంపుటం నించి)
సత్యలింగం’ పతంజలి శాస్త్రి గారు రాసిన ‘గుప్తా’91’ సంపుటం లోనిది. పుస్తకం కొనడానికి కింద ఇచ్చిన లింక్ వాడొచ్చు. గత సంవత్సరం చదివిన నేను చదివిన కథల్లో నిస్సందేహంగా  సత్యలింగం అత్యుత్తమైన కథ.     కథలోకెడితే 'టీటీ' అని పిలవబడే రైల్వే టికెట్ కలెక్టర్ కాంతారావు స్నేహితుడు స్వామి. తన ఇంట్లో అద్దెకుండే  కూర్మయ్య నాయుడి గురించి స్వామికి చెప్పుకుంటూ ఉంటాడు కాంతారావు. నాయుడు విపరీతమైన కోపిష్టి. ఒళ్ళూపైతెలీని కోపంతో ఇబ్బందుల్లో ఇరుక్కుంటూ ఉంటాడు. తన జీవితంలో ప్రశాంతత నెలకొనేటందుకు, కాంతారావును సలహా అడుగుతాడు నాయుడు. రైల్లో ఎక్కడో చూచాయగా విన్న విషయాన్ని ఆధారంగా చేసుకుని, నాయుడి  మనసులో సత్యలింగాన్ని ప్రతిష్టిస్తాడు కాంతారావు.  సత్యలింగం వల్ల కూర్మయ్య నాయుడు జీవితంలో ఏవి జరిగింది, అనేదే కథ. కూర్మయ్య నాయుడు ఎంత ఆసక్తికరమైన పాత్రో అంతకంటే కాంతారావు అంతర్మధనం , కూర్మయ్య నాయుడి పై అతనికి తెలీకుండా ఏర్పడే సానుభూతి, కాంతారావుని పాఠకుడి మనసుకి చాలా దగ్గరగా చేరుస్తాయి.  కథ చివరికి వచ్చేటప్పటికి నమ్మకం, విశ్వాసం, ఆధ్యాత్మికత మనిషి కి ఇచ్చే ఆసరా,  వీటన్నిటీ గురించి పాఠకుణ్ణి లోతుగా ఆలోచింపచేస్తుంది ‘సత్యలింగం’.   గుప్తా'91 పుస్తకం కొనడానికి - http://bit.ly/3lGsrqd This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp Chartable - https://chartable.com/privacy
46 minutes | Feb 17, 2023
మధురాంతకం రాజారాం గారి కథలు, రచనా జీవితం పై మధురాంతకం నరేంద్ర గారు
1993 వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి తన కథల పుస్తకానికి గెలుచుకున్న మధురాంతకం రాజారాం గారు తెలుగులో సుప్రసిద్ధ కథారచయిత. చిత్తూరు జిల్లాకు చెందిన రాజారాం గారు మూడు వందలకు పైగా కథలు రాసారు. వారి సమగ్ర కథాసంకలనం కిందటి వారం ఎమెస్కో పబ్లిషర్స్ వారు ప్రచురించారు. ఇందులో 295 కథలు ఐదు భాగాలలో ఇవ్వడం జరిగింది. ఈ ఎపిసోడ్లో మధురాంతకం నరేంద్ర గారు వారి నాన్న గారి కథల గురించి , రచనా జీవితం గురించి మాట్లాడటం జరిగింది. పుస్తకం కొనడానికి పల్లవి పబ్లిషర్స్ వెంకట నారాయణ గారిని 9866115655 ద్వారా వాట్సాప్ లో సంప్రదించండి. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp Chartable - https://chartable.com/privacy
8 minutes | Feb 15, 2023
'బేడమ్మ' - శ్రీరమణ గారి కథ
'బేడమ్మ' అనే ఈ కథ శ్రీరమణ గారు రచించింది. శ్రీరమణ గారు రాసిన శ్రీ ఛానల్ - 2 అనే సంకలనం లోనిది. పుస్తకం కొనడానికి ఇదే వెబ్ పేజీ లో ఉన్న లింక్ ని ఉపయోగించండి. https://www.telugubooks.in/products/sri-channel-2 బేడమ్మ ఆవిడ అసలు పేరేమిటో తెలియదు. పుట్టు పూర్వోత్తరాలూ తెలియవు.  ఎవర్ని అడిగినా “మాకు గ్రాహ్యం వచ్చినప్పట్నించీ బేడమ్మ యిలాగే వుంది. గోగుకాడలా” అంటారు తప్ప వయసు చెప్పలేరు.  ఒంగిపోకపోయినా నిలువెల్లా  వార్థక్యం తెలుస్తూనే ఉండేది. బ్రాహ్మణ వీధిలో ఉన్న పది యిళ్లూ తనవే అనుకునేది బేడమ్మ. రోజుకో  ఇంట్లో భోజనం చేసేది. అదీ ఒక్కపూట ! ఆ రోజు ఆ ఇంటెడు చాకిరీ తనే చేసేది “అప్పనంగా తింటే అరగదు నాయనా' అనేది.  ప్రతిరోజూ గుడిబావి నించి పది ఇళ్లకీ మడినీళ్లు మోసేది.  బ్రాహ్మణ వీధికీ, శివాలయానికి పది గడపల దూరం. తెలతెలవారకుండానే ఆలయానికి వెళ్లి, గుడిముందు కసువూడ్చి, బిందెడు నీళ్లు జల్లి ముగ్గువేసేది. తను తలారా నీళ్లు పోసుకుని, ఆనక గుడిబయట నందిబొమ్మని కడిగి, నిక్కపొడుచుకున్న నందిచెవుల మధ్య కాసిని పూలు పోసి, మూసి వున్న తలుపుల్లోంచి చంద్రశేఖర స్వామికి దణ్ణం పెట్టుకునేది బేడమ్మ.  కళ్లాపు జల్లులకు ధ్వజస్తంభం మీది చిలకలూ పిచ్చుకలూ నిదురలేచి మేతలకు బయలుదేరేవి. ఆ అలికిడికి ధ్వజస్తంభపు చిరుగంటలు వులిక్కిపడేవి. రాలిన జువ్వి పూరేకుల్ని చూసి బియ్యపు  గింజలనుకుని పిట్టలు ఆశగా చెట్టుకింద వాలేవి, నిద్రమొహాలతో.  కాదని తెలిసి టపటపా రెక్కలు కొట్టుకుంటూ గుంపుగా  ఎగిరిపోయేవి. ఈ లోగా బేడమ్మ బిందె నిండా నీళ్లు చేదుకుని - ఓ మందారం. నాలుగు  నందివర్ధనాలు, గుప్పెడు పారిజాతాలు, పుంజీడు పచ్చ గన్నేరులు  బిందెలో వేసుకునేది.  తళ తళలాడే నీళ్ల బిందె నడుముకి మోపి బేడమ్మ రోడ్డు వారగా వెళ్తుంటే పూలకలశం కదిలి వెళ్తున్నట్టుండేది.\ ఆ పసిపొద్దు కిరణాలలో  బిందెలోపూలు నీళ్లకుదుపులకి లయలూ హొయలూ వొలికించేవి. ఆ లేత వెలుగులకి సువాసనలు అద్దేవి.  అలా మొదలైన నీళ్లమోత సాగి సాగి, బేడమ్మ తలమీంచి కొసలనించి జారిన నీటిచుక్కలతో రోడ్డు వారగా పడిన నీళ్ల చార వీధికి అంచుదిద్దినట్టు అయ్యేది. పూర్తిగా తెల్లారేసరికి బ్రాహ్మణవీధి గడప గడపనీ శివాలయంతో తడిపోగులతో ముడివేసేది బేడమ్మ. ఆ వీధిలో ఏ కాస్త సందడి వచ్చినా బేడమ్మ సాయం కోరేవారు. అప్పడాలు, వడియాలు, ఊరగాయలూ లాంటి పై పనులు వచ్చినా, నోములూ, వ్రతాలు, చుట్టాలూ, తద్దినాలూ ఏమొచ్చినా బేడమ్మ రంగంలోకి దిగేది. రూపాయి అర్థా ఇస్తే పుచ్చుకునేది. ఏరోజు ఎక్కడ పెద్దతోడు కావాలంటే అక్కడా రోజు మకాం. పుట్టెడు అమాయకత్వం తప్ప పేచీ లేని మనిషి. ఓసారి దసరా ఉత్సవాలకి బెజవాడ కనకదుర్గమ్మని చూడ్డానికి వెళుతూ ఎవరో బేడమ్మని కూడా తీసికెళ్లారు. ఊరి పొలిమేర దాటడం, బస్తీ చూడడం బేడమ్మకి అదే మొదటిసారి. వచ్చాక అక్కడి వింతలూ, విశేషాలూ అనేకం చెప్పింది. “అక్కడ బారెడు, బారెడు అరటిదూటలకి వెలట్రీ తగిలించి వెలిగించారు నాయనా, అది వెలుగంటే వెలుగు కాదు... వెన్నెల..” అని ట్యూబులైట్లని గురించి చెబితే అందరూ నవ్వుకుని మళ్లీ మళ్లీ చెప్పించుకునేవారు.  ఆడైనా, మగైనా, పిల్లయినా, పెద్దయినా, పక్షయినా, జంతువైనా 'నాయనా' అని సంబోధించడం బేడమ్మ సొంత ముద్ర. పేచీ పూచీ లేని బేడమ్మకి వేరే దిగులూ విచారమూ లేవు గానీ ఒకే ఒక్క భయం ఆవిడని వేధించేది పాపం. తను చచ్చిపోతే కట్టెల్లో వేసి కాల్చేస్తారని ఆవిడకి చచ్చేంత భయం.... చిన్నా, పెద్దా ఎవరు పలకరించినా “ నన్ను కాల్చకండి నాయనా... నొప్పి పుడుతుంది... భరించలేను నాయనా” అని బతిమాలుకునేది. చీరకొంగున బేడకాసు తీసి లంచంగా ఇచ్చి ఒట్టు వేయించుకునేది. కొందరు అకతాయిలు బెల్లించి, బెదిరించి బెడలు పట్టేసేవారు. మా ఊళ్లో బేడమ్మ చేతికింద చెయ్యి పెట్టని వాళ్లు లేరు. బేడలు పుచ్చుకొని వారు లేరు.  ఆవిడ కష్టం కొద్దీ అక్షయంగా బేడలు కొంగు ముడికి జమకడుతూనే ఉండేవి.  ఓసారి కరణం గారింటికి జమా బందీకి తహసీల్దారు  గారొస్తే బేడమ్మ కమ్మగా వంట చేసి పెట్టింది. వంటనీ... వడ్డననీ ఆయన మెచ్చుకోగా చూసి, చొరవ చేసి బేడమ్మ తన సమస్యని చెప్పి  “నాయనా హోదాగలవాడివి. వస్తే నువ్వే చూసుకోవాలి. ఆ బాధ నేను భరించలేను నాయనా!” అని కన్నీళ్ళొత్తుకుంటూ తాంబూలంలో బేడ కాసు పెట్టి ఇచ్చింది. తాసీల్దారు బేడ లంచానికి అదిరిపడ్డారు. బేడమ్మ అమాయకత్వాన్ని అర్థం చేసుకొని ఆ బేడని కళ్లకి అద్దుకున్నాడు. ఆ విధంగా బేడమ్మ పేరు అనాదిగా స్థిరపడిపోయింది. రోజూ,  చివరి బిందెకి - గడకర్రతో మారేడు దళాలు రాల్చి, వాటి మీద దేవుడి వాటా పూలు ముఖద్వారపు రాతిపద్మం మీద కుప్ప పోసేది. ఆ పూలరెక్కల కింద బేడకాసు కప్పెట్టే సంగతి పెట్టినమ్మకి...
43 minutes | Feb 14, 2023
తిలక్ గారి 'దేవుణ్ణి చూసిన మనిషి'
తెలుగు వచనా కవిత్వాన్ని తన అద్భుతమైన ప్రతిభతో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన కవి, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్. అతి చిన్న వయసులో , యాభై సంవత్సరాలు కూడా నిండకుండా అయన మరణించడం తెలుగు వారి దురదృష్టం. తిలక్ గారి మరణానంతరం 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ' అమృతం కురిసిన రాత్రి ' ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది. ఇదిగాక ఆయన కొన్ని అద్భుతమైన కథలను రచించారు. ఇప్పుడు వినబోయే కథ 'దేవుణ్ణి చూసిన మనిషి' - 'తిలక్ కథలు' అనే సంకలనం నుంచి. ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చెయ్యడం జరిగింది. తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకర్ గారికి, హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఈ పుస్తకం మీరు కోనేటందుకు కావలసిన వివరాలు , ఇదే వెబ్ పేజీ లో ఇవ్వటం జరిగింది. కథ: గవరయ్య పెళ్ళాం లేచిపోయిందన్న వార్త ఊరు ఊరంతా ఉత్సాహంగా వ్యాపించింది. అంతకుముందు రోజునే చైనా ఇండియా సరిహద్దులలో దురాక్రమణ చేసిందనీ, యుద్ధం జరుగుతూన్నదనీ వచ్చిన వార్త చటుక్కున అప్రధానమైపోయి అందరూ మరచిపోయారు కూడా. ఆడది లేచిపోవడంలోని విశిష్టతని ఈ వూరువారొక్కరే గుర్తించారా అనిపిస్తుంది. యింత తెలుగు దేశంలోనూ! రోడ్ల కూడలిలో, కాఫీ హోటలులో (ఆవూళ్ళో ఒకటే వుంది) పొలంగట్లనీ, పంచాయితీ బిల్డింగ్ దగ్గరా పురుషులూ; పెరటి గోడల దగ్గరా, బావులూ, నీలాటి రేవుల దగ్గరా ఆడవాళ్ళూ ఈ విషయాన్నే చిత్ర విచిత్రంగా చెప్పుకుంటున్నారు. వట్టి లేచిపోవడమే అయితే యింత సంచలనం కలిగించకపోను; అందులోనూ ఎందుకూ పనికిరాని ఎదురింటి అరుగుమీది మిషన్ కుట్టుపనివాడితో లేచిపోవడమే మరీ విడ్డూరంగా వుంది. ఇంతకన్న మరో ఏ పెద్దమనిషితో లేచిపోయినా యింత అప్రదిష్ట ఉండకపోనని వూళ్ళో అనుభవజ్ఞులైన పెద్దలు అనుకున్నారు. చాలామంది యువకులు గవరయ్య భార్య తమని నిష్కారణంగా అవమానించినట్టూ అన్యాయం చేసినట్టూ బాధపడ్డారు. “వాడిలో ఏం చూసి లేచిపోయిందత్తా” అని మూడోసారి అడిగింది తన అత్తని ఒక పడుచు తన కుతూహలం ఆపుకోలేక. “పోనీ నువ్వే వాడితో లేచి పోకపోయావూ నీకు తెలిసొచ్చును” అంది అత్తగారు విసుగుతో, కోపంతో. “గవరయ్యకి బాగా శాస్త్రి అయింది” అని ఏకగ్రీవంగా ఆబాల గోపాలమూ తీర్మానించారు.  గవరయ్యను చూసి జాలిపడినవాడూ సానుభూతి తెలిపినవాడూ ఒక్కడు లేడు. గవరయ్య అంటే ఆ వూళ్ళో అందరికీ అసహ్యం. మనిషి కూడా నల్లగా ఎగుడుదిగుడుగా వుంటాడు. మొహంమీద స్ఫోటకం మచ్చలు, పెదాలు లావుగా మోటుగా వుంటాయి. కనుబొమ్మలు గుబురుగా గొంగళీ పురుగులు అతికించినట్లు వుంటాయి. ఊరికి శివారున వున్న పెద్ద పెంకుటింటి లోగిలిలో గవరయ్య వుంటాడు. “నాకు తెలుసును ఇలాంటిదేదో జరుగుతుందని” అన్నాడు కన్నులరమూసి అవధాని. అవధాని ఆ వూళ్ళో ధర్మకర్త. మునసబు చలపతి, కరణం నరసింహమూ తల వూపారు. దాంతో మరికాస్త ఉత్సాహంతో ఉపనిషద్వాక్యంలాంటి పై వాక్యానికీ వ్యాఖ్యానం చెప్పాడు ధర్మకర్త. “వేణుగోపాలస్వామి వూరికే పోనిస్తాడా? ప్రథమ కళత్రం చావనే చచ్చింది. ఇంక ఈ రెండో ఆవిడ చావుకన్న ఘోరమైన పని చేసి వూరుకుంది. ఒక్క ధర్మకార్యం చేశాడా? ఒక్క మంచిమాట చెవిని పెట్టాడా?” మున్సబు చలపతి చేతికర్రను నేలమీద తాటించి అన్నాడు “ఒక్కరిని దగ్గరకు రానిచ్చాడా? కర్కోటకుడండీ యీ గురవయ్య. ఎంత అహం, ఎంత పొగరు....” “పాపపు సొమ్మండీ పాపిష్టి ఆర్జితం! దాని ఫలితం వూరికే పోతుందా? మొన్న కుర్రాళ్ళందరూ వెళ్ళి భజన చందాకి ఒక్క రూపాయి _ ఒబ్బు రూపాయి యిమ్మంటే తరిమి కొట్టాడుట...” అన్నాడు కరణం. గవరయ్య యిరవై ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళవాడు ఈ వూరొచ్చాడు. ఈ వూళ్ళో అతనికో మేనత్త వుంది. తల్లీ తండ్రి లేని అతను యీ మేనత్త దగ్గరకు వచ్చిపడ్డాడు. వస్తూనే కొంత డబ్బుకూడా తీసుకుని వచ్చాడు. ఈ వూరికి రెండు మైళ్ళ దూరంలోనే టౌను వుంది. రోజూ ఉదయమే టౌన్ కి వెళ్ళి చీకటి పడ్డాక తిరిగొచ్చేవాడు. కొన్నాళ్ళకి తోళ్ళ వ్యాపారం చేస్తున్నాడని తెలిసి అందరూ “హరీ హరీ” అని చెవులు మూసుకున్నారు. మేనత్తతో యిది చాలా పాపమనీ బెడిసికొడుతూందని చెప్పారు. కానీ మేనత్త ఏమీ...
21 minutes | Feb 14, 2023
'అహింస' దాదా హయత్ గారి కథ!
'అహింస' దాదా హయత్ గారి 'మురళి ఊదే పాపడు' అనే కథా సంపుటం లోనిది. వృత్తిరీత్యా లాయర్ ఐన దాదా హయత్ గారు కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. దాదాపుగా డెబ్బై కథలు రాసారు. ఒక స్కూలు పిల్లవాడి గురించి రాసిన ఈ కథలో సున్నితమైన మానసిక విశ్లేషణనీ, పొందికైన పదాల కూర్పునీ మనం చూడొచ్చు. కథను హర్షణీయం ద్వారా మీకు అందించడానికి అనుమతినిచ్చిన దాదా హయత్ గారికి కృతజ్ఞతలు. ఈ పుస్తకం కొనాలంటే, ఈ లింకుపై క్లిక్ చెయ్యండి - http://bit.ly/2Ok88yb అహింస: అది మోకాలి మీదికి పాకింది. అది  ఒకసారి గంభీరంగా తన స్థితి గతులు' పరీక్షించుకొని ప్రమాద మేమీ లేదన్నట్లు మళ్ళీ కదిలి ముందుకు సాగింది ఆ నల్లటి గండుచీమ. నిద్రమత్తు కళ్ళతో దాన్నే స్తబ్దుగా చూస్తున్నాడు చంటి. అంతవరకూ ఓపిగ్గా దాన్ని గమనిస్తూ వచ్చాక దానిమీద హఠాత్తుగా ఆసక్తిపోయి విసుగుపుట్టేసి బొటనవేలికి మధ్యవేలును సంధించి లాగి ఒక్కటి తగిలించాడు. గండుచీమ ఎగిరి నేలమీదపడి సర్దుకొని నిలబడి దొరికి పోయినట్టు తికమకగా ఎటు పారిపోవాలని కాస్సేపు దిక్కులు చూసి వెనక్కి తిరిగి పలాయనం చిత్తగించింది. ఒక మోకాలి మీద గెడ్డం ఆన్చి నిర్లక్ష్యంగా పారిపోతున్న దాన్ని గమనిస్తూ దిగుల్లో పడిపోయాడు చంటి. ఆరోజు బడికి వెళ్ళాలంటేనే నీరసం ముంచు కొచ్చేస్తోంది. ఏం చేయాలో తోచక జేబు తడుముకొని ఇన్ని బలపాలూ చాక్ పీసులూ బయటికి తీశారు. అవి ఎప్పుడూ తన జేబులో వుండాల్సిందే--రాత్రిపూట కూడా. ఎవ్వర్నీ తీయనియ్యడు. ఓ చాక్వసుతో అరుగుమీద ఓ 'సున్నాగీసి. మధ్యలో నిలువుగా గీతగీసి చెవులు పెట్టి. పొడుగ్గా రెండు జడలు పెట్టి కింద రాశాడు. 'అమ్మ'. చంటి బళ్ళోచేరి రెండునెల్లే అయింది. కాని, అంతకు ముందే వాళ్ళమ్మ దగ్గర అక్షరాలన్నీ నేర్చేశాడు. అమ్మపక్కనే నాన్నని గీసి పీచు జుట్టు పెట్టాడు. తర్వాత గంభీరంగా తన సొంత సామర్థ్యాన్ని పరీక్షించుకొని తృప్తిగా చూసి కాస్త వెనక్కి జరిగి కింద మరోబొమ్మ గీశాడు.. 'టీచర్'. ఈలోపల అమ్మబయటికొచ్చి కొడుకు చిత్రకళాకౌశలాన్ని తిలకించి నవ్వి, “బొమ్మలు గీస్తూ కూచున్నావా చంటీ? బడికిపోవూ? మొహం కడుక్కొని స్నానం చేద్దూగాన్రా ,” అని కొడుకుని లేవదీసింది. మొహమ్మీది కొచ్చిన చింపిరి జుట్టుని వెనక్కి తోసుకొని, “అమ్మా, మా టీచర్ చూడవే - బావుంది కదూ?" కళ్ళు మెరిపించి వేలితో చూపిస్తూ అన్నాడు చంటి. “ఆఁ ఆఁ చాలా బావుంది. బడికి వేళ కాదూ? రా" చంటికి అరుగు దిగాలనిపించలేదు. బిక్కమొహం వేసుకొని దిగి అమ్మ వెంట వెళ్ళాడు. స్నానం చేయించుకొని, తల దువ్వించుకొని అమ్మవెంట వంట గది లోనికి వెళ్ళాడు చంటి. పొయ్యి వెలిగించి, గిన్నె పెట్టి ఉప్మాకోసం పోపువేసి తిరగ. పెడుతున్న అమ్మకొంగు లాగుతూ వగలు పోసాగాడు. “అబ్బ, వుండరా! ఉప్మా కానీ” అమ్మభుజం మీద గెడ్డం ఆన్చి గారంగా “అమ్మా” అని పిలిచాడు. చీర కొంగుని గుప్పిట బలంగా బిగించి మళ్ళీ పిలిచాడు “అమ్మా” “ఏమిట్రా?" “ఈరోజు ....” “ఊఁ”. “స్కూలోద్దే". చేస్తున్న పనాపి కొడుకు మొహంలోకి నేరుగా చూసి “ఏం?” అంది. చంటి జవాబివ్వలేదు. అమ్మ మళ్ళీ పన్లో పడింది. “అమ్మా” “మీ నాన్నగార్నడుగు ”. చంటి మొహం వేలాడేసుకొని నిల బడ్డాడు. కాస్సేపాగి మళ్ళీ కొంగు లాగాడు “ఊఁ....” అమ్మ చంటి చేతుల్లోంచి కొంగులాగేసింది. చంటి ఖిన్నుడై పోయాడు. అమ్మ నిరసనకు మొహవైతే చిన్నబోయింది గాని, బడికి మాత్రం వెళ్ళాలన్లేదు. బిక్క మొహంవేసుకొని కాస్సేపలాగే నిలబడ్డాడు. తర్వాత అమ్మ భుజం మీద చెయ్యేశాడు. కాస్సేపూరుకొని ఒక చేత్తో భుజంమీది " కొడుకు చేతిని నొక్కి పట్టి తలతిప్పి లాలనగా చూసి “అలాగేలే, ఇంట్లో కూచుని చదువుకో” అంది. చంటి మొహం వికసించింది. లావులావు బుగ్గల్ని నవ్వుతో మరింతలావు చేసి వంటగదిలోంచి బయటికి పరిగెత్తి నాన్నగారి ముందు “హాయ్ హాయ్” అని గెంతులేస్తుంటే పేపరు చదువుతున్న నాన్నగారు “ఏమిట్రా?” అన్నారు కొడుకుని మురిపెంగా చూస్తూ. గెంతడం ఆ పేసి కుర్చీ కోడు పట్టుకు నిలబడి, “నాన్న అమ్మేం, స్కూలుకెళ్ళొద్దంది " అన్నాడు సిగ్గుగా. . నాన్నగారు విస్మయంగా చూసి, “ఎందుకు?" అనడిగారు. చంటికేం చెప్పాలో అర్ధం కాలేదు. ఆలోచన్లో పడ్డట్టు మొహం పెట్టాడు. నాన్నగారు వంటగదిలోకి కేకేసి,...
24 minutes | Feb 13, 2023
వంశీ గారి 'సొట్ట ఆదిగాడు' - 'మా దిగువ గోదారి కథలు' నుంచి
'సొట్ట ఆదిగాడు' అనే ఈ కథ, వంశీ గారి "మా దిగువ గోదారి కథలు' అనే కధాసంపుటి నించి. పుస్తకం కొనడానికి - https://www.telugubooks.in/products/vamsi-ma-diguva-godari-kathalu?_pos=4&_sid=1941d5909&_ss=r (ఈ లింక్ ని ఉపయోగించండి.) 'సొట్ట ఆదిగాడు': ఆ వూళ్ళో వున్న అరవై ఎకరాల తోటలూ, వూరికి ఎదురుగా వున్న గోదావరి మధ్యలో వున్న వంద ఎకరాల లంకలు రావి కంపాడు రాజులవి. ఆ రాజుల తాలూకు గుమాస్తాలే వూళ్ళో వుండి కూలోళ్ళనీ పాలేళ్ళనీ పెట్టి పంటలు పండిస్తున్నారు. అదీ ఈనాటి నించి కాదు ఏనాటి నించో. అయితే, దొంగలుగానీ, దోచుకుపోయేవాళ్ళుగానీ ఆ ప్రాంతాలకి రాకండా కూలోళ్ళు పాలేళ్ళూ ఉద్దారకుడూ పగటిపూట కాపలాగాస్తే రాత్రిపూట గంగాలమ్మ తల్లి కాపలా కాస్తుంది. గంగాలమ్మంటే మామూలు మనిషి కాదు. గ్రామదేవత. మహాశక్తి, ఆది శక్తి. ఆవిడకి విగ్రహం లేదు. తోటలో ఒక పంపర పనాస చెట్టు మొదట్లో బొట్టెట్టి గుగ్గిలం పొగేసి అగరొత్తులు వెలిగించి నైవేద్యాలు పెట్టుకుని దణ్ణాలు పెట్టుకుంటారు. ఆమధ్య మాదిగ పేటలో కాళిదాసు సూరన్నగాడు తోటలో కాసే కాబూలు దానిమ్మకాయలు కోసుకెళ్లామని రాత్రిపూట వస్తే తెల్లారేసరికి ఆవిడ పాదాల దగ్గర (పంపరపనస చెట్టు మొదట్లో) రక్తం కక్కుకు చచ్చిపడున్నాడు. ఇంకోసారి లంకలో పొగాకు మోపులు పట్టుకెళ్లామని నావఁ వేసుకెళ్తే, తెల్లవారేసరికి వాళ్ల తలకాయలు పొగాకు తోటలోనూ, మొండాలు ఎక్కడో వున్న మూలస్థానం అగ్రహారం రేవులోనూ తేలాయి. పరిశోధనంటా దిగిన పోలీసులకి చంపినోళ్ళెవరన్నదిఎన్నాళ్ళకి తేలలేదు. అయినా సరే డిటెక్షను చేస్తున్న పోలీసుల్ని చూసి, నవ్వుకున్న గోపిలంక జనం, “వెర్రిగాకపోతే ...అమ్మోరు. వీళ్ళకి దొరుకుద్దా?” అనుకున్నారు. అమ్మోరు గంగాలమ్మ తల్లంటే రావికంపాడు రాజులకి చాలా నమ్మకం, చాలా భయం భక్తీనీ, ఆ తల్లిని నమ్మేవాళ్ళు ముక్కనుమ రోజున కోడిపుంజుల్నీ బోల్డన్ని మేకపోతుల్ని గొర్రెపోతుల్ని బలేస్తారు. ఆ రోజంతా ఆవిడ ముందు రక్తం గట్టు తెగిన ఏరులా పారుతూ వుంటుంది. నెర్రలు తీసిన నల్లరేగడి నేలలో ఇంకుతా వుంటుంది. అమ్మవారికి తుని నించి కొమ్ము బూరా వాళ్లని, పెద్దాపురం నించి డప్పులవాళ్లని పిలిపించి మా గొప్పగా చేయిస్తారు సంబరం. చిత్రమేంటంటే ఎప్పుడూ గుమాస్తాలకి వదిలేసే ఆ రాజులో ఒకరు మాత్రం ఆ సంబరం రోజు వచ్చి తీరతారు. అది ఆనవాయితీ.. ఎడం కాలు మడం దగ్గర తోడెయ్యడంతో వేళ్ళని మాత్రం భూమ్మీద ఆన్చి నడిచే గుత్తాల ఆదియ్యని సొట్టాదిగాడంటారంతా. చాలా కష్టపడి పనిచేసే ఆ సొట్టాదిగాడి నోరు మంచిది కాదంటారు. అలాంటి సొట్టాదిగాడు రావికంపాడు రాజుల కమతంలో జేరాడు. ప్రతి ఏడు వారి వంశంలో ఎవరో ఒకరొచ్చేవారు. అలాంటిది ఆ ఏడు ముక్కనుమ రోజు ఆ రావి కంపాడు రాజులు ముగ్గురొస్తున్నారు. గోపిలంక గంగాలమ్మ వారి సంబరం చరిత్రలోనే, ఇదో గొప్ప వింతని గుమస్తాలంతా తెగ కంగారు పడిపోతా, సంబరం చాలా పెద్ద ఎత్తున జరిపించే పనుల్లో వున్నారు. రకరకాల బెత్తాయింపులు, రకరకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. తూర్పు నుండే తోటల మధ్య పడమట వేపుండే గోదావరితల్లి కనపడేలా కొబ్బరితోటల మధ్యలో అచ్చం రాజులకోటలా కట్టిన గెస్టహౌస్లోకి దిగిన రాజులు, పాలేళ్ళందరికి తలకో జత బట్టలూ నూట పదహారు! చొప్పున డబ్బులు ఇమ్మని గుమస్తాలకి ఆర్డర్లేశారు. ఎక్కడ దొరికిందో మూడు ముంతల సందకల్లు దొరికింది సొట్టాదిగాడికి. దాన్ని లాగిస్తుండగా రాజులు తోటలోకి దిగారన్న సంగతి తెల్సింది. నిషా బాగా ఎక్కేసిన ఆదిగాడికి రాజులో మాటాడాలనిపించింది సొట్టాది గాడు అనుకుంటున్నట్లు అక్కడెవరికైనా తెలిస్తే కాళ్ళకి పలుపుతాడు మెలేసి పక్కకి లాగేసే వారు. కానీ, ఎవరి పనుల్లో వాళ్లుండటంతో ఈడ్ని పట్టించుకోలేదు. గెస్ట్ హౌస్ బాల్కనీలో కూర్చున్న రావికంపాడు రాజులకి ఈ తోటల్లో మా గొప్పగా దర్శనమిచ్చే ఆ గోదావరి తల్లి, ఈ వాతావరణం ఇంత గొప్పగా వుంటుందని ఇప్పుడే తెలిసొచ్చింది. వాళ్లు కళ్ళు మూసుకుని గంగమ్మ తల్లికి దణ్ణమెట్టుకుని ఇక నించి ప్రతి ఏడూ వస్తామని మొక్కుకున్నాకా స్కాచ్ పోసిన గ్లాసులందుకున్నారు. ఇంతలో దిగిపోయిన సొట్టాదిగాడు, “మా రాజులకి నమస్కారవండి," అన్నాడు.  మందు పుచ్చుకుంటా ఎవర్నువ్వన్నట్టు చూశారు. “నన్ను సొట్టాదిగాడంటారు బాబూ..." అంటా ఆ రాజుగారి నోట్లో వున్న దాన్ని చూసి, "తవరి నోట్లో అదేంటండి తెల్లగా అంత పొడుగ్గా వుంది," అన్నాడు. నవ్వేసిన రంగరాజు, "ఇదా? దీన్ని కింగ్ సిగరెట్ అంటార్లే... సిగరెట్ కోసమొచ్చావా?" అనందిస్తుంటే సిగ్గుపడతా తలొంచుకుని, “వద్దండి బాబూ నా దగ్గర గుర్రంబీడి వుందండి." అన్నాడాదిగాడు. "అయితే సరే," అనుకుంటా సిగరెట్లు వెలిగించి స్కాచ్ తాగుతున్నారు. వాళ్ళ ముందు చతికిలబడిపోయిన...
12 minutes | Feb 13, 2023
'నైట్ డ్యూటీ' - డాక్టర్.వి.చంద్రశేఖర్ రావు గారి కథ
“ తెరిచిన గుడిలాంటిది హాస్పటల్. బిహేవ్ లైక్ ఎ డివోటెడ్ ప్రీస్ట్”  ఏమి జోక్ వేశారు సార్! కలకాలం గుర్తుంచుకోవాల్సిన జోక్. పగిలిన సిరంలు, మొద్దుబారిన నీడిల్సూ, ఎక్స్పయిరీ డేటు అయిపోయి 'మృత్యువు నోట్లో పాలపీకలం' అన్నట్లుగా చూస్తున్న స్క్రిప్టో పెన్సి లిన్లూ, నైవేద్యపు చీరపై మెన్సెస్ మరకలా ఫంగస్ పట్టిన సెలైన్ బాటిల్సు- ఇది సార్ హాస్పటల్ అంటే. తుప్పు పట్టిన మంచాలూ, అన్ని రకాల బాక్టీరియాలకూ, వైరస్లకూ ఆహ్వానం పిలికే ముసలి వేశ్యల్లాంటి బెడ్లు, వాటి పై భగవంతుని కర్మాగారంలో పనికిరాక పారవేసిన యంత్రాల్లాంటి పేషెంట్లు.  “పేషెంట్ ఈజ్ ది రియల్ టీచర్! అతన్ని గౌరవించు. ప్రేమించు.” సార్ చెప్పిన ఆణిముత్యాలే యివి.  “కొంగర్లు తిరుగుతూ ఏమిటా సిగ్గు, ఇప్పుడే సమర్త ఆడిన దాన్లా! జాకెట్టు పైకి లాక్కో. డాక్టరుగారు గుండె పరీక్ష చేస్తారు.” “మగాయన కదమ్మా! సిగ్గేస్తుంది". - “ఏమి నీలుగుతున్నావే! అంత సిగ్గయిన దానివి వెయ్యి రూపాయిలు పట్టుకుని ఏ ప్రైవేటు నర్సింగ్ హోమ్ కో వెళ్ళక పోయావా? ఊరికే మందిస్తామంటే నకరాలు పోతున్నావే!” స్టాఫ్ నర్సు అరుపులు. కాండ్రించి ముఖం పై ఊసినట్లుగా ఒక అసహ్యకరమైన అవమానంలా ఆవేల్టి నా నైట్ డ్యూటీ మొదలైంది. రాత్రి తొమ్మిదింటికి రొటీన్ రౌండ్స్ - చేస్తున్నాను.  “సార్! ఈ పేషెంటుకు మందులివ్వద్దన్నారు పెద్ద డాక్టరుగారు. మన చేస్తే ఎనాల్డినో, ఐరన్ టాబ్లెట్ ఇవ్వమన్నారు. అబ్జర్వేషనట. డయాగ్నోసిస్ ఇంకా కాలేదట.” డ్యూటీ నర్సు వినయంగా చెప్పింది.  అబ్జర్వేషనా వల్లకాడా. రేటు వుండదు. డబ్బు చేతిలో పడితేనే ట్రీట్మెంటు. ఈ లోపల పేషెంటు కాస్తా టపా కట్టేస్తాడు. ఈ హాస్పటల్లో, డాక్టరే ఒక నయం కాని వ్యాధి. ఇక్కడ పేషెంటు సిలువ పైన జీసస్. హౌస్ సర్జన్లు ద్రోహం చేసిన జూడాస్.  ఏం చెయ్యగలను మందులివ్వకుండానే ముందుకు కదిలాను. మరో పేషెంటు. “ఏమిటి తల్లీ నీ బాధ!' “ఇదో స్పెషల్ కేసు సార్. గైనిక్ వార్డు కేసు. కార్డియాక్ ట్రబుల్ అని మనకు రిఫర్ చేశారు. ఇదో 'విడో' సార్! మొగుడు చచిది నాలుగేళ్ళవుతోంది. డబ్బిస్తారని ఆశతో స్టెరిలైజేషన్ క్యాంప్ కొచ్చి ట్యూబెక్టమీ చేయించు కొంది. పి.జి. స్టూడెంటు ఎవరో చేశాడట ఆపరేషను. కాంప్లికేషన్స్ డెవలప్ అయినాయట. అక్కడుంటే గొడవవుతుందని మన ముఖాన పడేశారు,”  నర్సు చెప్పింది. కళ్లనిండా సిగు. దైన్యం నింపుకొని, “బిడ్డలకు రెండు పూటలైనా కడుపునిండా తిండి పెడదామని ఈ కక్కుర్తి పని చేశానయ్యా! నాకేమన్నా అయితే బిడ్డలు అనాథలవుతారు. దయ చూపండి బాబు,” అంటూ చేతులు జోడించింది పేషెంటు. - నీ బాధలూ, గాథలూ ఎవరికి అర్థం అవుతాయి తల్లీ! నువ్వో 'ఒళ్ళు బలిసిన లం...'గానే మా నర్సుకు కనిపిస్తావు. నువ్వో 'చిరాకు కలిగించే న్యూసెన్సు లాగే డాక్టర్లకు తోస్తావు. నీ ఆకలి, నీ అమ్మ ప్రేమ ఎవరికర్థం అవుతాయి. రౌండ్స్ ముగిసేసరికి పదకొండు దాటింది.  “స్పెషల్ వార్డులో ఖైదీ ఒకడున్నాడు. అటెండుకండి సార్. నక్సలైట్ లీడరట. బాగా పోలీసు బందోబస్తు వుంది. జైల్లో సూసైడ్ ఎటెంప్ట్ చేశాడట. పొద్దునొచ్చింది కేసు. స్పెషల్ కేసు అని మరీ చెప్పాడు పెద్ద డాక్టరు.”  నర్సు , నేనూ స్పెషల్ వార్డువైపు కదిలాం. ఈదేశంలో కెల్లా ప్రతిభావంతులైన రచయితలు పోలీసులే. జైల్లో ఆత్మహత్య' ఈ థీమ్ పై రోజుకో రసవత్తరమైన కథానిక. కథల పోటీల్లో బహుమతులన్నీ వీళ్లకే ఇవ్వాలి. కాలి పొడవునా బాండేజ్. ఎముకల పోగులా వున్నాడాయన. నెరిసిన తల. దీర్ఘ కాలపు ఆలోచన. అలుపుతో అర్ధనిమీలితాలైన కళ్లు. చిరునవ్వుతో 'హలో' అని పలక రించాడు. బాండేజ్ మార్చి, సి.పి. ఇంజక్షన్ ఒకటి ఇచ్చాను.  “నొప్పి ఎక్కువగా వుంటే చెప్పండి. ఎనాల్జిన్ ఇస్తాను,” అని అడిగాను. “శరీరపు బాధలకు మనస్సు రెస్పాండ్ కావడం ఎప్పుడో మానేసింది నేస్తం! ఉద్యమ విజయాలే మాకు నిజమైన మెడికేషన్,” అంటూ నవ్వాడాయన. ఆయన నవ్వులో చిత్రమైన ఆకర్షణ వుంది.  గుడ్ నైట్ చెప్పి బయటకు
26 minutes | Feb 13, 2023
Part 2 - ‘వఱడు ‘ – అల్లం శేషగిరిరావు గారు
కేంపు సైటుకి మైలు దూరంలో వుంది “వర్క్ స్పాట్”, కారడవిలో కొత్తగా రైల్వే లైను వేస్తున్నారు. వేలాది పనివాళ్ళు శ్రమించి పని చేస్తున్నారు. సూర్యోదయం నుంచి తిరిగి సూర్యాస్తమయందాకా బుల్ డోజర్లు, డంపర్లు, కేసులు ధడ్ ధడ్ మని శబం చేస్తుంటాయి. అక్కడే ఒక పెద్ద బ్రిడ్జి కూడా కడుతున్నారు. రోజంతా గుబిలు గుభిలుమని కొండ రాళ్ళు పేలుతుంటాయి. హిందుస్తానీలు, బ్రిడ్జి పనులు చేసే మళయాళీ మోపలాలు, సర్దార్జీలు, బంగాళీ బాబులు, ఒకరేవిటీ అన్ని రకాల జాతుల వారినీ అక్కడ చూడొచ్చు. ఉత్తరాదినుండి వచ్చిన కంట్రాక్టర్లు, కేంపుని వర్కు స్పాటుకి దగ్గర్లోనే వేసుకున్నారు. రైల్వే కేంపు మాత్రం మైలు దూరాన ఉంది. అటు, ఇటు కాంట్రాక్టర్ల జీపులు, రైల్వే జీపులు చాకుల్లా తిరుగుతుంటాయి. అసిస్టెంట్ ఇంజనీరుగారి జీపు ఆగగానే కంట్రాక్టర్లు సవినయంగా నమస్కారం చేస్తూ “ఆయీయే సాబ్ !” అంటూ ఎదురుగా వెళ్ళారు. ముందు సీట్లో నుంచి అసిస్టెంట్ ఇంజనీరు రామారావుగారు, వెనుక సీటునుంచి అకౌంటెంటు దశరథరామయ్యగారు దిగారు. దశరథరామయ్యగారి చేతిలో రెండు లావుపాటి ఫైల్సున్నాయి. “దశరథరామయ్యగారూ! నేను బ్రిడ్జి ఇన్ స్పెక్షనుకి వెళ్ళేస్తాను. వచ్చేటప్పటికి అన్ని కాగితాలు సిద్ధంగా ఉంచండి కాంట్రాక్టర్ల సంతకాలు తీసుకుని నా సంతకాలు కూడా చేసేస్తాను, చిన్నయ్యా! ఆ మర్రిచెట్టు కింద జీపు పెట్టి పోయి ఎక్కడేనా పడుకో, నేను తిరిగొచ్చేదాకా! పాపం, రాత్రంతా నిద్ర లేనట్టుంది!” అంటూ కంట్రాక్టర్లు అందించిన కాఫీ తాగేసి వర్కు స్పాటుకి బయల్దేరాడు. . చిన్నయ్యా, దశరథరామయ్యలు కూడా వాళ్ళిచ్చిన కాఫీలు తాగేశారు. దశరథరామయ్య మాత్రం ఎందుకో బితుకు బితుగ్గా కనపడుతున్నాడు. ఇంజనీరుగారు వెళ్ళిపోగానే పక్కనే వున్న కంట్రాక్టరు ఆఫీసు టెంటు లోనికి వెళ్ళి ఫైళ్ళు విప్పి లెక్కలు మొదలు పెట్టాడు. “పంతులుగారూ! నిద్ర ఊపేస్తోంది, నేను జీపులోకి పోయి పడుకుంటాను”. అంటూ జీపుని ఎదురుగా ఉన్న మర్రి చెట్టు కిందకి లాగించేసి, వెనక సీట్లో ముడుచుకు పడుకున్నాడు చిన్నయ్య. రాత్రంతా నిద్రలేదేమో దశరథరామయ్యకి కూడా కునుకు ముంచుకొచ్చేస్తోంది. తమాయించుకుంటూ కాగితాలమీద లెక్కలు కడుతున్నాడు, దగ్గర్లోనే పనిచేస్తున్న బుల్డోజరు శబ్దం బుర్రని దొలిచేస్తోంది. ఇంజనీరుగారు ఇన్స్పెక్షన్ నుంచి తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండు గంటలయింది. ఎండ మండిపోతోంది. ఎప్పుడు పట్టేసిందో నిద్ర పాపం, దశరథరామయ్య టేబుల్ మీద వాలిపోయి అలాగే నిద్రపోయాడు. – “దశరథరామయ్యగారూ! ఆ కాగితాలవీ తియ్యండి. సంతకాలు పెట్టేస్తాను. మళ్ళా భోజనానికి టైమై పోతుంది. త్వరగా పోవాలి”. అంటూ నిద్రపోతున్న దశరథరామయ్య ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని మొగంమీద, మోచేతుల మీద కారుతున్న చెమటని “ఉస్సు”రంటూ తుడుచుకున్నాడు. దశరథరామయ్య నిద్రలోంచి ఉలికిపడి లేచి కళ్ళు నులుముకుంటూ కాగితాల ఫైలు ముందు పెట్టాడు. – ఫైల్లో కొన్ని కాగితాలు తిరగేసి ఆశ్చర్యంగా దశరథరామయ్య నిద్రమొహంలోకి చూస్తూ “పెద్ద బిల్లేదయ్యా?…….. అదే బ్రిడ్జి వర్కుది”. “చెయ్యలేదు సార్” – మనిషి గొంతుకలో తడారిపోతూ దీనంగా చెప్పాడు. “వాట్ ? చెయ్యలేదా? ఓ! మైగాడ్ “……… రామారావు కోపంతో ఊగిపోతూ క్షణం సేపు మాటాడలేకపోయాడు. ఎర్ర ధూళి, చెమట పట్టిన రామారావు మొహం కోపంతో మరింత ఎర్రబారింది. కళ్ళు చింతనిప్పుల్లాగా కణకణ లాడుతున్నాయి. “నిన్ననగా చెప్పానే ఎవడి చంక నాకుతున్నావ్ ?” అరిచాడు. “ఎక్స్క్యూజ్ మీ సార్ ! నిన్న రాత్రంతా అమ్మాయికి గడబిడ చేసింది కద సార్ …… రాత్రే బిల్లు చేసేదామనుకుంటే……” “షటప్! నీ ఇంట్లో గొడవ ఎవడిక్కావాలయ్యా? నీకు డబ్బిస్తున్నది ఆఫీసు పని చెయ్యడానికి గాని, నీ కూతురుకి పురుడొచ్చింది, అదయింది, ఇదయిందని పని ఎగగొట్టడానికి కాదు, వర్త్ లెస్ ఫెలోస్!” అని పిడుగు పడినట్టు గర్తించాడు. ఇంతలో తిరుగు ప్రయాణానికి చిన్నయ్య జీపు తెచ్చి పెంటుముందు ఆపి లోపలికొచ్చాడు. ఎదురుగా దశరథరామయ్య వెలవెలబోతూ గజగజ లాడిపోతున్నాడు. “రేపట్నుంచే నిన్ను పనిలోనుండి డిశ్చార్జి చేసేస్తున్నాను. గెటౌట్ ……. డోంట్ షో యువర్ ఫేస్; పెద్ద దొరగారు ఆ బిల్లు సంతకం చేసి అర్జంటుగా పంపమన్నారని మరీ మరీ చెప్పానే? ఇప్పుడతను నామీద దెయ్యంలాగ పడిపోతాడు. మీరంతా ఎందుకయ్యా ఉండి, నో! ముసలాడివని కనికరించి అపాయింట్ మెంటు ఇప్పిస్తే పని ఎడతావ్ ! కీప్ ఆఫ్ఫ్రమ్ మీ డర్టీ ఫెలో!” అంటూ ఇంకా కోపం పట్టలేక టేబుల్ మీదనున్న ఫైలు తీసి దశరథరామయ్య మొహం కేసి కొట్టాడు.  అసలే భయంతో సగం చచ్చిపోయిన దశరథరామయ్య ఉద్యోగం పోతుందనేసరికి పై ప్రాణాలు పైనే పోయాయి. దాంతో ఫైలు మొహానికి తగలగానే కళ్ళు తిరిగిపోయి పడిపోయాడు. పక్కనున్న కంట్రాక్టరు మనిషెవడో పట్టుకుని కింద పడుకోబెట్టి మొహం మీద వీళ్ళు చల్లాడు.  ఇది చూస్తున్న మిలిట్రీ చిన్నయ్యకి నెత్తురు...
30 minutes | Feb 13, 2023
Part 1 - ‘వఱడు ‘ – అల్లం శేషగిరిరావు గారు
‘వఱడు ‘ – అల్లం శేషగిరిరావు గారి ‘అరణ్య ఘోష’ కథాసంకలనం లోనిది. పొలిటికల్ సైన్స్ లో ఎం ఏ పట్టా పుచ్చుకున్న అల్లం శేషగిరి రావు గారు, రైల్వేస్ లో పని చేసి రిటైర్ అయ్యారు. విశాఖపట్నం లో నివసించారు. ఆంగ్ల సాహిత్యంలోని అనేక ప్రసిద్ధ రచయితల రచనలను ఆయన ఇష్టంగా చదువుకున్నారు. బాల్యం ఒరిస్సా లోని ఛత్రపురంలో గడిచింది. చుట్టుపక్కల ఎక్కువ అటవీ ప్రాంతం. ఆయన తన పదమూడవ ఏటినించీ, స్నేహితులతో , ఇంట్లో వారితో కలిసి, వేటకు వెళ్లడం అడవుల్లో చాలా సమయాన్ని గడపడం జరిగింది. అటవీ నేపథ్యంలోనే ఎక్కువ శాతం కథలు రాసారు. రాసిన పదిహేడు కథల్లో సమాజంలో వుండే అసమానతలూ, అట్టడుగు వర్గాల జీవితాలపై విశ్లేషణ, ముఖ్య ఇతివృత్తాలుగా , మనకు కనిపిస్తాయి. కథల్లో ప్రకృతిని వర్ణించేటప్పుడు ఆయనకున్న పరిశీలనా జ్ఞానం , భావుకత్వం మనల్ని కట్టి పడేస్తాయి. 1981 లో ఆయన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి పురస్కారం లభించింది. *** కథను ప్రచురింపడానికి అనుమతినిచ్చిన శ్రీమతి మాధవి, శ్రీ రఘునాథ్ అల్లం గార్లకు కృతజ్ఞతలు. కథను ‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే – https://gaana.com/podcast/harshaneeyam-season-1(Harshaneeyam on Gaana app) స్పాటిఫై యాప్ లో వినాలంటే – http://bit.ly/harshaneeyam(Harshaneeyam on Spotify) ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే – http://apple.co/3qmhis5(Harshaneeyam on Apple. Podcast) వఱడు  : రాత్రి పదిగంటలు కావస్తోంది. ఆ కీకారణ్యమంతటా పేరుకున్న నల్లటి జారు ముద్దలాంటి చీకటి అలుముకునుంది. కేంపు గూడారాలు మాత్రం తెల్ల తెల్లగా కనిపిస్తున్నాయ్. మధ్యలో అక్కడక్కడ కేంపు పనివాళ్ళు వన్య మృగాల బారినుండి రక్షించుకోడానికి వేసిన మంటలు, దూరాన్నించి కొరివి దెయ్యాల్లా కన్పిస్తున్నాయ్. గుడారాల్లో హరికెన్ లాంతర్లు మిణుకు మిణుకు మంటూంటే, ఆఫీసు టెంటుల్లో పెట్రోమాక్సు లైటు వెలిగిపోతోంది. దశరధరామయ్య గారు ఇంకా ఆఫీసు పనిచేసుకుంటున్నారు. అలా రాత్రి ఒంటి గంట వరకూ ప్రతిరోజూ పని చెయ్యడం ఆయనకి పరిపాటే. – చిమ్మెట్టలు “జూయ్ “మనిచేసే శబ్దం తప్ప అంతా నిశ్శబ్దంగా వుంది. ఎక్కడో దూరంగా కొండల్లో కొండ గొర్రె అవిరామంగా “కార్ కార్ “మని అరుస్తోంది. దశరధ రామయ్యగారికి చిన్న దగ్గుతెర వచ్చింది. కాస్సేపు గొంతుకలో కఫం తగ్గేదాకా దగ్గి, గుండెని చేత్తో పట్టుకుని టెంటు తెర తొలగించి బైటకొచ్చి తుపుక్కున ఉమ్మాడు. ఆయాసం కాస్త తేలికపడిన తరవాత, ఇహ ఇవాల్టికి ఇంటికి పోదామనుకున్నాడు. – కానీ ఇంకా బోలెడు పనుండి పోయింది. ఐనా ఇప్పుడు టైము ఎంత అయుంటుందో అని చిన్నయ్య గుడారం వైపు చూశాడు. జీపు డ్రైవరు చిన్నయ్య హెడ్ క్వార్టర్సులో వుంటే, సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకు ఎన్ని పనులున్నా లైటార్పేసి పడుకుంటాడు. అది అతని ఎక్సు మిలిటరీ డిసిప్లేన్ అంటాడు. ఇంకా లాంతరు గుడారంలో వెలుగుతోంది. అంటే పన్నెండు కాలేదన్నమాట. సరే మరో గంట పనిచేసి పోదామని టెంటు లోకి దశరధరామయ్యగారు దూరుతుండగా “ఠకాలు”మని బూట్లు కొట్టుకున్న చప్పుడు, వెంటనే “గుడ్ నైట్ పంతులు బాబూ” అనే అరుపుకూడా వినిపించింది. అకస్మాత్తుగా మిలిట్రీ కాషన్ లాంటి అరుపు వినపడగానే ఉలిక్కి పడినా, అది చిన్నయ్య కేకే అని పోల్పేసుకున్నాడు. “ఆఁ రావయ్యా! నిద్రపోలా!” అని పలకరించాడు. తన గుడారం ముందు అటెన్షన్ ఫోజులో సెల్యూట్ చేస్తూ నిలబడ్డాడు చిన్నయ్య, “రాత్రుళ్ళు కూడా నీ మిలిటీ సెల్యూట్లేనా మిలిట్రీ వదిలేసినా, ఇంకా ఆ డ్రెసులూ వీశడు బరువు బూట్లు, మిలిటీ సెల్యూట్లూ మానవు గదా….. రావయ్యా!…… భోంచేశావా?” అనడిగాడు దశరధరామయ్య.. “ఇప్పుడే అయింది బాబూ, చుట్ట కాల్చుకుందామని బైటికొచ్చాను. మీరింకా పని చేస్తున్నారా? అసలే మీ హెల్తు మంచిదికాదు. ఉబ్బసపోళ్ళు. ఈ చలికాలం...
38 minutes | Feb 13, 2023
సి.రామచంద్ర రావు గారి 'ఏనుగుల రాయి'!
సి.రామచంద్ర రావు గారు రాసిన ఈ కథ ‘వేలుపిళ్లై’ అనే కథా సంపుటం లోనిది. కథను మీకు హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చిన రామచంద్ర రావు గారికి కృతజ్ఞతలు. వచ్చే వారం హర్షణీయంలో రామచంద్ర రావు గారితో ఇంటర్వ్యూ మీరు వినవచ్చు. అన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా , మార్చి రెండో వారంలో ‘వేలు పిళ్ళై కథలు ‘ కొత్త ఎడిషన్ రిలీజ్ అవుతోంది. కథలోకి వెళ్లబోయ్యే ముందు ముళ్ళపూడి వెంకటరమణ గారి మాటల్లో రామచంద్ర రావు గారి గురించి –‘పొగడ పూలు’: గొప్ప కథలు రాసిన టాప్‌టెన్ రచయితలలో మీకు చప్పున గుర్తొచ్చే ఒక్కపేరు చెప్పమని అడగ్గానే చాసోగారు ఠక్కున చెప్పిన పేరు సి. రామచంద్రరావు. రాసికన్న వాసికే విలువనిచ్చే అమితమిత రచయితలలో చాసో తరువాత సి. రామచంద్రరావు గారినే చెప్పుకోవాలి. యాభై అరవై యేళ్లలో సి. రామచంద్రరావుగారు రాసినవి తొమ్మిది కథలే! నల్లతోలు, వేలుపిళ్లై, ఏనుగులరాయి, టెన్నిస్ టూర్నమెంటు, గాళిదేవరు, కంపెనీలీజ్… మైగాడ్! వేటికవే! ఇన్నేళ్ళయినా వాడిపోని పొగడపూలు, అపురూపాలు, ఆరనిదీపాలు. ఇవి నిజాయితీ గల కథలు అన్నారు చాసోగారు. రోజూ ఎన్నో కథలు చదువుతున్నా, కథలలో మునిగితేలుతున్నా మళ్ళీ ఈయన కథ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేటంతటి అపురూప శిల్పాలు అన్నారు నండూరి రామమోహనరావు గారు. ఆంధ్ర సచిత్ర వారపత్రికలో – ఆ గోల్డెన్ పీరియడ్‌లో నండూరివారి సరసన సహాయకుడిగా పనిచేసిన నేనూ, రావుగారి కథలకు బొమ్మలు వేసిన బాపూ ఈ కథలు చదివి త్రిల్లయిపోయేవాళ్ళం. చెప్పుకుని తల్చుకుని మురిసిపోయే వాళ్ళం… కావ్యాల్లాంటి కథలు అన్నారు ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు. అంతర్జాతీయ స్థాయిగల కథలు అన్నారు ఆదివిష్ణుగారు. ఎన్నోయేళ్ళు – ఉహూ, ‘హూ – టీ’ ఎస్టేట్స్‌లో ఉన్నతాధికారిగా ఉన్న ఈ లాయర్ – మానేజర్- తెల్లదొరల – నల్లదొరల మధ్య హాయిగా విహరించారు. వెలుగునీడలు చూశారు. మనకు చూపించారు. టెన్నిస్ ఛాంపియన్‌గా ఎన్నో ట్రోఫీలు గెలిచారు. రావుగారి సోదరులందరూ టెన్నిస్ ఆటగాళ్ళే. ఒక సోదరుడి కొకొడుకు – వింబుల్డన్ ప్లేయర్ మహేష్ భూపతి. రామచంద్రరావు గారు మనతో మాట్లాడేది తెలుగే అయినా టెలుగులా వినపడుతుంది. స్టయిలు హొయలు అంతా ఇంగ్లీషే. మాటా ఇంగ్లీషే. కాని మనసంతా తెలుగు. రామచక్కని తెలుగు. స్పష్టమైన ఖచ్చితమైన తెలుగు. ఈ తెలుగు కథలకు పుట్టినిల్లు రావు గారి కలం అయినా చాలా కథలకు మెట్టినిల్లు తమిళనాడు! తమిళతంబీలు చాలమంది కనిపిస్తారు. అయినా వాళ్ళంతా మనవాళ్ళయిపోయి మనలో ఒకళ్ళయిపోతారు. అదీ రావుగారి శిల్పం – ప్రజ్ఞ! ఇంగ్లీషు, తెలుగు, తమిళ పాత్రల చుట్టూ అల్లిన ఈ కథలు – ఏ దేశంలోనయినా రాణించే కథలు…. మాటల వెనక మనసులను ఎక్స్‌రే తీసి చూపించగల కథలు. అన్‌హెర్డ్ మెలోడీస్ ఆర్ స్వీటర్ స్టిల్ అన్నట్టు – ఆకుచాటుపిందెలా, మబ్బుచాటు వెన్నెలలా, నీడచాటు నీడలా – ఆయన కథలలో మాటచాటు మాటల అంతరంగ తరంగాలు – అపురూప శిల్పాలు. గంగిగోవుపాలు గంటెడైనను చాలు అని వేమన్న అన్నా – ఈ గోవు మరిన్ని పాలు చేపాలని రావుగారిని కోరుకొందాం. అంతవరకూ ఆయన రాసిన ఆ కాసినీ మేసిమేసి నెమరేసి ఆనందించుదాం… -ముళ్ళపూడి వెంకటరమణ. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp Chartable - https://chartable.com/privacy
19 minutes | Feb 13, 2023
స వెం రమేష్ గారి 'ఉత్తర పొద్దు' - 'ప్రళయకావేరి కథలు' సంకలనం నుంచి
‘ప్రళయ కావేరి కథలు’ పుస్తకం కొనాలంటే - https://bit.ly/2TXhEub ఉత్తర పొద్దు : మా ఊరిని ఆనుకొనే ఉంది. ప్రళయకావేరి. సుమారు ముప్పై మైళ్ల పొడవు .. పది మైళ్ల వెడల్పు ఉన్న సరస్సు అది. ప్రళయ కావేట్లో నలభై వరకూ దీవులు న్నాయి. వాటికి రకరకాల పేర్లు. వాటిల్లో కొన్ని దీవుల్లో మాకు చుట్టాలున్నారు. ఆ దీవుల్లో ఒకటి 'జల్లల దొరవు.' విసిరేసినట్లు ఒక మూలగా ప్రళయకావేరి ఒడిలో ఒదిగి ఉండేది. ఆ దీవిలో నాకు వరసకు మామ ఒకాయన ఉండేవాడు. వాళ్లింటికీ మా ఇంటికీ రాకపోకలు ఉండేవి. నేను కూడా అప్పుడప్పుడూ అక్కడకు పోతుండేవాడిని. జల్లల దొరువు ప్రయాణమంటే చిన్న విషయం కాదు. తెల్లవారి అయిదు గంటలకు మొదలుపెడితే రాత్రి ఏడుకో, ఎనిమిదికో ఆ దీవికి చేరేవాళ్లం. అంటే ఒక పగలంతా ప్రయాణమే. కాసేపు నీళ్లల్లో నడిచి కాసేపు దీవుల్లో నడిచి ఒక దీవి నుంచి ఇంకో దీవిని దాటి చేరుకోవాలి. ఇంతా చేసి మా ఊరికి, జల్లల దొరువుకి నడుమ దూరం పాతిక కిలోమీటర్లలోపే. ప్రళయకావేట్లో ప్రయాణం ఒక వింత అనుభూతి. నడిచి నడిచి కాళ్లు పీకుతున్నా, ఇంకా నడవాలనే మనసు పీకుతుంటుంది. ఎండా, వానా, మంచు.... ఇవన్నీ కాలానికి అనుగుణంగా సరస్సులో ఎరగనన్ని వన్నెలు చూపించేవి. మా ప్రయాణం ముచ్చట్లు మొదలు పెడితే మీకూ తెలుస్తాయి ఆ వన్నెచిన్నెలు. ఒకసారి నేనూ, మా వెంకటన్న, నా నేస్తాలు శీనయ్య, చెంగయ్య నలుగురం ప్రయాణం కట్టినాము ప్రళయకావేరిలో, శీనయ్య, చెంగయ్యలు 'రాగన్న పట్టెడ'కు, నేనూ, మా అన్న జల్లల దొరువుకు. అప్పుడు నా వయస్సు పన్నెండో, పదమూడో ఉండొచ్చు. అప్పటికి ఉత్తరకార్తె పెట్టి రెండు దినాలయింది. ఆ ఏడాది మఖ, పుబ్బల్లోనే గట్టి వానలు పడినాయి. అందుకే మా అమ్మకూ, మా అవ్వకూ మా ప్రయాణమంటే దిగులు. 'దార్లో వానొస్తే 'రాగన్నపట్టెడ'లోనే నిలిచిపోండి. ఉత్తరపొద్దులో కావేట్లో దిగబాకండి' మా అమ్మ హెచ్చరించింది. 'ఉత్తరపొద్దంటే వాళ్లకేం తెలుస్తాదమ్మే' అని మాయమ్మని ఒక్క కసురు కసిరింది మా అవ్వ. మావైపు తిరిగి 'నాయినా ! మద్దినేళ మడకలిప్పే పొద్దులో పెళయకావేట్లో నడవబాకండ్రా' అనింది.  'పునమాల తిప్ప దాటినాక, చిన్నతోటకు పొయ్యే దాకా దిగులుతిప్పలెక్కువ. చూసి నడవండి' మా పెద్దమ్మ సలహా ఇచ్చింది.  'దిగులుతిప్ప' అంటే ఒక రకమైన బురదగుంట. ఊబి కాదు. ఇందులోకి దిగితే నడుములదాకా కూరుకుపోతాము. 'ఉత్తరపొద్దు బిడ్డల్ని ఏమారస్తాదేమో' మా అమ్మ గొణగసాగింది. ఆడవాళ్ల సణుగుడంతా విన్న మా తాత లేచి, 'మేయ్! గమ్మునుంటారా? లేదా? అయినా పంట రంగస్వామి లేదా. ఏదన్నా అయితే చూసుకొనేదానికి. పోయిరానీ వాళ్లని' అన్నాడు. మా వైపు చూసి, 'అబయా. నలగామూల దాటినాక పెళయకావేరమ్మకు సక్కలగిలెక్కువ. మునేళ్లు అదిమి పెట్టి నడవండి. లేకపోతే గెబ్బిడు గెబ్బిడు ఎంట్ర కాయల్ని జవరాల్సిపడతాది' అన్నాడు.  అంటే నలగామూల దగ్గర జారుడు ఎక్కువ. జాగ్రత్తగా నడవకపోతే పడతామని చెప్పడం. అప్పటికి మా పల్లెల్లో తమదల (రాగుల) వాడకం ఇంకా ఉంది. చిక్కటి మజిగ కలిపిన గట్టి అంబలిని స్టీలు టిఫిన్లో పోసిచ్చినారు. అట్లే రెండు పులుసన్నం  పొట్లాలు  కట్టిచ్చినారు.  తెల్లవారి ఆరుగంటలకు 'అటకానితిప్ప'కు పొయ్యే బస్సు ఎక్కి కూచున్నాము. బస్సు బయల్దేరి కసారెడ్డిపాళెం, చెరువుకండ్రిగ, దావాది గుంటలు దాటి కుదిరికి వచ్చింది.  కుదిరి వస్తే మా ఆనందం ఎక్కువవుతుంది. కదిరి దాటగానే ప్రళయ కావేరి మొదలవుతుంది. ఇక కనుచూపు మేరా నీలాలు ఆరబోసినట్లు నీళ్లు. ప్రయాణించి 'అటకానితిప్ప'లో మమ్మల్ని దించింది,  బస్సు. కావేరిలోని దీవులకు కేంద్రం 'అటకానితిప్ప 'దీవి. దీవులలో ఉండేవాళ్ళు  ఆ పేటకు (మా ఊరికి) రావాలంటే 'అటకాని తిప్ప'కు వచ్చే బస్సు ఎక్కాలి. మూడునాళ్లుగా ముసురుపట్టిన మబ్బుల చాటు నుంచి సూర్యుడు తొంగి తొంగి చూస్తున్నాడు.  అటకాని తిప్పలోని వినాయకుడి గుడి దగ్గరకు పోయి తెచ్చుకొన్న అంబలిలో కొంచెం తాగినాము. .. 'ఏ ఊరికి సిన్నా?' ఒక ముసలాయన అడిగి నాడు. 'మేము జల్లల దొరువుకీ, వీళ్లు రాగన్నపట్టెడకీ' ఇద్దరి తరపునా నేనే చెప్పినాను.  'జల్లల దొరువా ! నాయినా దూరాబారం బొయ్యేవోళ్లు. బిన్నా బయల్దేరండి. తూరుపుగాలి మళ్లింది. వానొస్తాదేమో! ఇప్పుడు పెళయకావేట్లో దిగితేగానీ సద్దికూటేళ్లకు 'కొరిడి'కి పోలేరు. ఉత్తరపొద్దులో యాడ్నో ఒక దెగ్గిర నిలబడిపోండి' అన్నాడా ముసలాయన. మేము ఆ మాటతో దెబగుబా ప్రళయకావేట్లో దిగినాము. తూరుపు నుంచి చల్లగాలీ లేత ఎండా కలిసి మమ్మల్ని గిలిగింతలు పెడుతున్నాయి. వానలు బాగా పడి సరస్సంతా నిండుగా ఉంది. అడుసు మీగాళ్లనూ, నీళ్లు మోకాళ్లనూ దాటుతున్నాయి. వలసపక్షులు కూడా కొంచెం ముందుగానే వచ్చినట్లుండాయి....
29 minutes | Feb 12, 2023
'రామగ్రామ నుంచి రావణలంక దాకా' రచయిత సీతారామరాజు గారితో పరిచయం.
'రామగ్రామ నుంచి రావణలంక దాకా' నవల రచయిత సీతారామ రాజు గారి సొంత వూరు, పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయి గూడెం. రియల్ ఎస్టేట్ రంగంలో వున్నారు. నివాసం హైదరాబాద్. ఆరు వారాల క్రితమే రిలీజ్ అయిన ఈ నవల 800 ప్రతుల మించి అమ్మకాలు సాధించి పాఠకుల విశేష ఆదరణకు నోచుకుంది. పుస్తకం కొనడానికి కింది లింక్ ఉపయోగించండి - https://amzn.to/3EoRIMn Harshaneeyam on apple podcast https://apple.co/3K1vMdw This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp Chartable - https://chartable.com/privacy
19 minutes | Feb 5, 2023
'East Wind' పుస్తక పరిచయం - ఉణుదుర్తి సుధాకర్ గారితో
ఉణుదుర్తి సుధాకర్ గారు రాసిన 'తూరుపు గాలులు' పుస్తకం సౌత్ సైడ్ బుక్స్ పబ్లిషింగ్ ద్వారా ఇంగ్లీష్ లో 'East Wind' పేరుతో అనువదించబడింది. ఈ అనువాద ప్రక్రియలో తన అనుభవాన్ని సుధాకర్ గారు మనతో పంచుకున్నారు, ఈ ఎపిసోడ్లో. త్వరలో ఈ పుస్తకం Hyderabad book trust వెబ్సైటు ద్వారా, ఇతర పుస్తక విక్రేతల ద్వారా లభ్యం అవుతుంది. ఆటా బహుమతి పొందిన 'యారాడకొండ' నవలా రచయిత శ్రీ . ఉణుదుర్తి సుధాకర్. వృత్తి రీత్యా మెరైన్ ఇంజనీర్ అయిన శ్రీ సుధాకర్ రాసిన 'తూరుపు గాలులు' ' చలిచీమల కవాతు' కథాసంపుటాలు కూడా విశేష ఆదరణ పొందాయి. రచయిత పుస్తకాలు కొనడానికి - https://bit.ly/unudurthi This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp Chartable - https://chartable.com/privacy
40 minutes | Feb 4, 2023
'తెలుగు కథ స్థాయి' - పాత్రికేయులు, రచయిత మందలపర్తి కిషోర్ గారితో సంభాషణ
మందలపర్తి కిషోర్ గారు గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు లోనూ ఇంగ్లీష్ లోనూ కవిత్వం రాస్తున్నారు. పుస్తక అనువాదాలు చేస్తున్నారు. తెలుగు కథను , ఇంగ్లీష్ కథను విస్తృతంగా చదివారు. పత్రికా రంగంలో విశేష కృషి చేశారు. సిఫీ, ఇండియా టుడే-తెలుగు పత్రికల సంపాదకునిగా వ్యవహరించారు. 'కన్యాశుల్కం పలుకుబడి' (గురజాడ పదకోశం - 1), పడమటి కిటికీ (పాశ్చాత్య సాహిత్య పరిచయం) , పెరటి చెట్టు (వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్ర-పరిచయం) అనే పుస్తకాలు ప్రచురించారు. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp Chartable - https://chartable.com/privacy
32 minutes | Jan 22, 2023
'డిస్టోపియా' కథలు - రచయిత్రి శ్రీసుధ గారితో పరిచయం
గుంటూరు జిల్లాకి చెందిన శ్రీసుధ మోదుగు, వైద్యరంగంలో పనిచేస్తున్నారు. జమైకాలో నివాసం. 'అమోహం', 'విహారి', వీరి కవితా సంకలనాలు. రెక్కల పిల్ల, డిస్టోపియా అనే కథాసంపుటాలను ప్రచురించారు. 'అంతర్హిత' అనే నవల ఈ మధ్యనే విడుదల అయింది. 'డిస్టోపియా' కొనడానికి కింది లింక్ ఉపయోగించండి. http://bit.ly/3wg2nUW This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp Chartable - https://chartable.com/privacy
15 minutes | Jan 20, 2023
'ఆట' - శ్రీసుధ గారు రాసిన 'డిస్టోపియా' నించి
'ఆట' అనే ఈ కథ శ్రీసుధ మోదుగు గారు రాసిన 'డిస్టోపియా' అనే కథా సంపుటం నించి. రచయిత్రి, కవయిత్రి అయిన శ్రీసుధ గారు వృత్తి రీత్యా వైద్యులు. జమైకాలో నివాసం. వారికి కృతజ్ఞతలు. పుస్తకం కొనడానికి కింది లింక్ ఉపయోగించండి. http://bit.ly/3wg2nUW This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp Chartable - https://chartable.com/privacy
COMPANY
About us Careers Stitcher Blog Help
AFFILIATES
Partner Portal Advertisers Podswag Stitcher Studios
Privacy Policy Terms of Service Your Privacy Choices
© Stitcher 2023